– కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు రూ. 5 కోట్లతో సర్వీసు బ్లాకు నిర్మాణం కోసం ముందుకొచ్చారు. పొదిలి ప్రసాద్ గారు రూ. 10 కోట్లతో మరో నిర్మాణం నిమిత్తం కృషి చేస్తున్నారు. నాట్ కో ఆధ్వర్యంలో మరొక భవనం శంకుస్థాపన జరగబోతుంది. ఆసుపత్రిలో రక్త పరీక్షలు ప్రైవేట్ లాబ్స్ కి పంపితే పంపిన వైద్యుల నుంచి ల్యాబ్ బిల్లులు వసూలు చేయడంతో పాటు, కఠిన చర్యలు తీసుకుంటాం. 60 అంశాలతో కూడిన అజెండాతో సమావేశం నిర్వహించాం. త్వరలోనే పేదలకు సంపూర్ణ సేవల ద్వారా మంచి చేసేలా జీజీహెచ్ ను అందించబోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ లు బయట ప్రైవేట్ ఆసుపత్రులు నడపడంపై తగు సమయంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.