Mahanaadu-Logo-PNG-Large

అసంఘటిత కార్మికుల భద్రతకు చర్యలు

కూటమి మేనిఫెస్టోలో వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు
ఆటోనగర్‌లో మరిన్ని కొత్త పరిశ్రమలు
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌

తెనాలి, మహానాడు : కార్మికుల హక్కుల కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయులు ఉన్న ప్రదేశం తెనాలి కావడం గర్వకారణమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. మే డేను పురస్కరించుకుని బుధవారం తెనాలి ఆటోనగర్‌లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కార్మిక పతాకాన్ని ఎగరవేసి పలువురు కార్మికులను సత్కరించి అభినందించారు. అనంతరం మనోహర్‌ మాట్లాడుతూ పార్టీల కతీతంగా తెనాలిలో మే డే వేడుకలు నిర్వహించడం హర్షణీయ మన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించిన అంశాలపై సవివరంగా పొందుపరచడం జరిగింద న్నారు. అసంఘటిత కార్మికుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెనాలిలోని ఇండస్ట్రియ ల్‌ పార్క్‌, ఆటోనగర్‌ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నట్లు మనోహర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో తెనాలి ప్రాంతంలో మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు. ఆటోనగర్‌ ప్రాంతంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌, అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్న మాట్లాడుతూ సమాజంలో కార్మికుల పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగిందన్నారు. కార్మికుల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.