ప్రజాగళం సభలో మహిళకు అత్య అవసర వైద్యం

తక్షణ వైద్యం అందించి కాపాడిన డా.చదలవాడ
వెనువెంటనే స్పందించి ప్రాణాలు రక్షించిన చదలవాడ పై ప్రశంసలు
మెడికల్ స్టాల్ కు పంపి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు

చిలకలూరిపేట17, మహానాడు న్యూస్: బొప్పూడిలో నిర్వహించిన ప్రజా గళం సభలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అచేతన స్థితిలో ఉన్న మహిళా కార్యకర్తను రక్షించడానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జి డా౹౹చదలవాడ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

మహిళకు ప్రథమ చికిత్స అందించి కాపాడారు.అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించడానికి మహిళను మెడికల్ స్టాల్ కు పంపించి మెరుగైన వైద్య సేవలు అందించారు.అనంతరం మహిళ కోలుకోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్బంగా సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన చదలవాడ పై ప్రశంసల వర్షం కురిసింది.