నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చదలవాడ అరవిందబాబును కలిశారు. ఎన్నికల ప్రణాళిక, ప్రచారం, భవిష్యత్తు అంశాలపై చర్చించారు. నరసరావుపేట గడ్డపై కూటమి జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని అరవిందబాబు పేర్కొన్నారు. ఓటమి భయంతో దేనికైనా తెగించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారని, దీనిని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని కోరారు.