Mahanaadu-Logo-PNG-Large

జూలై 1న దర్శిలో మెగా వైద్యశిబిరం

డాక్టర్స్‌ డే రోజున ప్రజాసేవను ప్రారంభిస్తున్నా
అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేస్తా
టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి

దర్శి: డాక్టర్స్‌ డే సందర్భంగా జూలై 1న దర్శిలో మెగా వైద్య శిబిరం నిర్వహిం చనున్నట్లు దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం..ఇచ్చిన హామీ ప్రకారం అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం దర్శిలో తన నివాసం దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మెగా మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పా రు. దర్శి ఓటమిపై చంద్రబాబు అనేకమంది పార్టీ పెద్దలతో సమీక్షించారు..గత ఎన్నికల్లో దాదాపు 40 వేలకు పైగా మెజార్టీతో వైసీపీ గెలిచింది. తన ఎంపిక సరైనదిగా బాబు గుర్తించారు. ఓడినా ప్రజల హృదయాల్లో నిలిచారని పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించటం ఆనందంగా ఉందన్నారు. తన గెలుపుకోసం కృషి చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దు.. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు.

దర్శి అభివృద్ధికి మాట ఇచ్చాను.. మాట నిలబెట్టుకుంటాను. మీరు నన్ను ఒక బిడ్డగా, కుటుంబసభ్యురాలిగా ఆదరించారు. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. నాకు ఒక ఫోన్‌ కాల్‌ చేసి మీ సమస్యలను తెలియజేస్తే ఆచరణ సాధ్యమైతే పరిష్కరించేం దుకు కృషి చేస్తానని చెప్పారు. ఓటమిపై మరోసారి సమీక్షించుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ మాడపాకుల శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి, దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.