జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం నుంచి మాజీ ఎంపీటీసీ చింతలచెరువు నాగేం ద్రం ఆధ్వర్యంలో పసుపులేటి శ్రీను, పసుపులేటి కుమార్, పసుపులేటి వినయ్, వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి శ్రీరాం చిన్నబాబు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి శ్రీరాం జయరాముడు, చిన్నబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీటీసీ బండ్ల జ్ఞాన్ ప్రకాష్, శ్రీనివాస్, ఎస్.కె.కరీం, వాడకొప్పుల కొండ తదితరులు పాల్గొన్నారు.