Mahanaadu-Logo-PNG-Large

ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం

రాష్ట్ర వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు తమ నివాసంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ తో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని, పంటలకు నాణ్యమైన పురుగుల మందులు అందించాలని, ఈ నెల 18న రైతన్నలకు అందించబోయే పీఎం కిసాన్ తదితర అంశాలపై చర్చిస్తూ ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.