వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీశైలం వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరావు, సీనియర్ టీడీపీ నాయకులు, లాయర్ రామకోటేశ్వరావు, టీడీపి నాయుకులు ఘనంగా స్వగతం పలికారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంత్రి అమరావతి బయలుదేరి వెళ్ళారు.