న్యూ ఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపాల్లి కృష్ణారావు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ ల గురించి ఆయనతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని గడ్కరీకి చెప్పారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు.