Mahanaadu-Logo-PNG-Large

కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి కొల్లు రవీంద్ర విన్నపాల వెల్లువ

– సానుకూలంగా స్పందించిన కిషన్‌ రెడ్డి

న్యూ ఢిల్లీ, మహానాడు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విన్నపాలు చేశారు. ఆ వివరాలు…

– జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి.
– రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయండి.
– ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు)లో మైనింగ్ అండ్‌ మినరల్ ప్రాసెసింగ్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలి.
– ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గ్రానైట్ ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేయాలి.
– ఆర్‌ఐఎన్‌ఎల్‌కు క్యాప్టివ్ ఇనుప ముడి ఖనిజం, బొగ్గు గనులను తక్షణమే కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలి.
– క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పెట్టుబడుల్ని ఏపీ ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలి.
– ఆఫ్‌షోర్ మైనింగ్ వేలంలో పాల్గొనేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.