విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన

విజయవాడ, మహానాడు: విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నోవొటెల్ హోటల్ లో సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొంటారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులను మంత్రి కలుస్తారు.