– 400 మందికి ఆహారం, పండ్లు, మంచినీరు పంపిణీ
విజయవాడ, మహానాడు: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన పేషీలోని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలంలోని పెద్ద పులిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 400 మంది వరద బాధితులకు ఆహారం, పండ్లు, మంచినీరును ఆయన పేషీ సిబ్బంది అందజేశారు.
గ్రామంలోని పీహెచ్ సీలో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. మరిన్ని గ్రామాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మంత్రి పేషీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సహాయక కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వల్లూరు శ్రీమన్నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వాడపల్లి తేజ, డీపీవో అలవాల పవన్ కల్యాణ్, సర్పంచ్ శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.