ఊర్మిళ నగర్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

విజయవాడ: విజయవాడలోని భవానిపురం 43వ డివిజన్ ఊర్మిళ నగర్‌లో వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పర్యటించారు. వరద ముంపు బాధితుల ఇళ్ళకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి పరిశీలించారు. కాలనీ మొత్తం శానిటైజేషన్ చేయిస్తున్నామని, నిలిచిపోయిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తామని తెలిపారు. “ప్రతి ఒక్క బాధితునికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం,” అని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం అందరూ వరద బాధితులకు అండగా ఉన్నారని, ముఖ్యమంత్రి అర్ధరాత్రి కూడా నిద్రపోకుండా వరద పరిస్థితులపై సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

సహాయ చర్యలు కొనసాగింపు

వరద బాధితుల సహాయక చర్యలు మరో రెండు మూడు రోజులు కొనసాగిస్తామని చెప్పారు. కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబుకు బాధితులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మంత్రి వాసంశెట్టి అన్నారు.

ప్రతిపక్షంపై విమర్శలు

“పేను కొరుకు లాగా రాష్ట్రాన్ని బోడి గుండు చేసిన జగన్మోహన్ రెడ్డి మా పరిపాలన గురించి మాట్లాడడం విడ్డూరం,” అంటూ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.

ఈ పర్యటన సందర్భంగా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల, బాయిలర్ల, భీమా శాఖ బాధ్యతలను సమీక్షించారు.