సభ్యులుగా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్
అమరావతి, జులై 3: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4 వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుండి జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ, సిఐడి, ఇంటెలిజెన్సు అదనపు డీజీలు, సెబ్ డైరెక్టర్ పాల్గొంటున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై మంత్రుల సబ్ కమిటీని ఈ సమావేశంలో చర్చించనుంది.