తెదేపా శ్రేణులకు అందుబాటులో మంత్రులు, నాయకులు

షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం

మంగళగిరి, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉండనున్నారు. ఎవరెవరు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటారో పార్టీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

ఆగస్టు 1న పర్చూరి అశోక్ బాబు (ఎమ్మెల్సీ), దేవినేని ఉమా (మాజీ మంత్రి), 2వ తేదీన గొట్టిపాటి రవికుమార్ (మంత్రి) పల్లా శ్రీనివాస్ యాదవ్ (రాష్ట్ర అధ్యక్షులు), 3వ తేదీన నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు), పల్లా శ్రీనివాస్ యాదవ్ (రాష్ట్ర అధ్యక్షులు), 5వ తేదీన కింజరాపు అచ్చెన్నాయుడు (మంత్రి), బొల్లినేని రామారావు (జాతీయ ఉపాధ్యక్షులు), 6వ తేదీన వంగలపూడి అనిత (మంత్రి), బీదా రవిచంద్ర (జాతీయ ప్రధాన కార్యదర్శి), 7వ తేదీన పొంగూరు నారాయణ (మంత్రి), కేఎస్ జవహర్ (జాతీయ ప్రధాన కార్యదర్శి), 8వ తేదీన బీసీ జనార్దన్ రెడ్డి (మంత్రి), కోట్ల సూర్య ప్రకాష్ (జాతీయ ఉపాధ్యక్షులు), 9వ తేదీన నిమ్మల రామానాయుడు (మంత్రి), పల్లా శ్రీనివాస్ యాదవ్ (రాష్ట్ర అధ్యక్షులు), 10వ తేదీన నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు), పల్లా శ్రీనివాస్ యాదవ్ (రాష్ట్ర అధ్యక్షులు), 12వ తేదీన ఆనం రామానారాయణ రెడ్డి (మంత్రి), వర్ల రామయ్య (జాతీయ ప్రధాన కార్యదర్శి) 13వ తేదీన టీజీ భరత్ (మంత్రి), వైకుంఠం ప్రభాకర్ చౌదరి (జాతీయ ప్రధాన కార్యదర్శి), 14వ తేదీన డా. డోలా బాల వీరాంజనేయ స్వామి (మంత్రి), కిషోర్ కుమార్ రెడ్డి (జాతీయ ప్రధాన కార్యదర్శి) అందుబాటులో ఉండనున్నారు.