ప్రజా శ్రేయస్సే కూటమి ధ్యేయం 

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ 
వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం  
ఆనాడు వాలంటీర్లు లేకుంటే జగన్ చేతులెత్తేశారు 
ఎండల్లో తిప్పి పింఛన్ దారుల ప్రాణాలు తీశారు 
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది
అరాచక నాయకులను ప్రజలే తిప్పి కొట్టాలి

మంగళగిరి, మహానాడు :  కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని… సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో నేడు రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఉదయం 10 గంటలకు 95% పింఛన్ లను పంపిణీ చేశామని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు అన్నారు.  నాడు రాజకీయ లబ్దికోసం వృద్ధులను ఎండల్లో తిప్పి 35 మంది పింఛన్ దారుల ప్రాణాలను జగన్ తీశాడని… ప్రగల్భాలు పలికే నాయకులు ఎవరో… ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే  నాయకులు ఎవరో దీంతో ప్రజలే గుర్తించాలని వారు కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ…

నేడు ఉదయం 10 గంటలకే 95% పింఛన్లు పంపిణీ చేశాం. నాడు వాలంటీర్ల వంకతో జగన్ వృద్ధుల ప్రాణాలు తీశాడు. వాలంటీర్లు లేకుండానే నేడు సక్రమంగా పింఛన్లు పంపిణీ చేశాం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వాలంటీర్లతో రాజీనామా చేయించి వృద్ధులతో జగన్ ఆడుకున్నాడు.  వాలంటీర్లు లేకుంటే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మాట్లాడిన వైసీపీ నేతలు వాళ్ల వల్లే ఓడిపోయామని చెబుతున్నారు. నేడు వాలంటీర్లు లేకపోయినా అధికారుల చొరవతో 100 % పింఛన్లు ఒక్కరోజే పంపిణీ చేశాం. పింఛన్లను ప్రారంభించి పేదలను ఆదుకున్న మహనీయుడు నందమూరి తారక రామారావు. పింఛన్ల పెంపు పేరుతో నాడు జగన్ మోసం చేశాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

నేడు ముందుగానే డ్యాంలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. రైతుల ముఖాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. రైతులకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుబడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి. జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచలను ప్రజలు గమనించాలి. సుపరిపాలన అందించాలనే కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేసి దాన్ని మళ్లీ మాపైనే రుద్దేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు. అరాచక ఆలోచనలను  జగన్ మోహన్ రెడ్డి ఆపకుంటే భవిష్యత్ లో భంగపాటు తప్పదన్నారు.

దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ..

నాడు 35 మంది పింఛన్ దారులను మండుటెండల్లో తిప్పి జగన్ ప్రాణాలు తీశాడు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో  రూ. 7000 తెచ్చి ఇంటికి ఇచ్చాం. దివ్యాంగులకు 100% వైకల్యం ఉన్నవారికి రూ. 15 వేలు ఇవ్వడం దేశ చరిత్రలోనే రికార్డు. పింఛన్ల పంపిణీపై నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఎలా నడుచుకుందో చూశాం. రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ. 2,737 కోట్లలో రూ. 2,400 కోట్లు ప్రజల చేతుల్లోకి ఇప్పటికే వెళ్లింది. రౌతు సమర్థవంతుడైతే గుర్రం పరిగెట్టినట్టు సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో నేడు పరిపాలన సక్రమంగా వెళుతుంది.  పనిచేసే ప్రభుత్వానికి, కబుర్లు చెప్పే ప్రభుత్వానికి నేడు తేడా కనిపిస్తోంది.

పుంగనూరు పెద్దిరెడ్డి బాధితులతో పాటు గ్రీవెన్స్ కు వస్తున్న అర్జీదారులందరూ వైసీపీ బాధితులే. వారి నుంచి అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు, శాఖలకు వినతులు పంపిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఇకనైనా జగన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలి. పోలిసులపై దురుసుగా ప్రవర్తించడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం. ఢిల్లీ వెల్లి నానా యాగి చేసి… ప్రతిపక్షం ఇస్తేనే సభకు వస్తాము లేదంటే రామని చెప్పడం సిగ్గుచేటు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా మారకుండా.. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై నోరు మెదపకుండా  బెంగుళూరు ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్ లలో  పబ్బం గడపుతున్నారు.

నాడు పేదల కోసం మహా నేత ఎన్టీఆర్ 30 రూపాయాలతో పింఛన్ ను స్టార్ట్ చేశారు. దాన్ని చంద్రబాబు పెంచి పేదలను ఆదుకున్నారు. పింఛన్ పెంచుతున్నామంటూ… 60 నెలలు పింఛన్ దారులకు డబ్బులు ఎగ్గొటి జగన్ అన్యాయం చేశాడు. సూర్యుడు రాకముందే పింఛన్ ఇస్తున్నామని జగన్ డబ్బా కొట్టుకున్నాడు… నేడు వాలంటీర్లు లేకపోయినా ఉన్న అధికారులతోనే ఒక్క రోజులోనే 60 లక్షల పింఛన్ దారులకు పింఛన్ అందించాం. ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకుని నేడు నా భూతో నా భవిషత్ అనేలా పింఛన్లు పంపిణీ చేశాం.

తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డిని కలవడానికి గడిచిన ఐదేళ్లలో మంత్రులు, ఆనాటి ఎమ్మెల్యేలకే దిక్కులేదు. అందుకే వైనాట్ 175 అంటూ… 11 సీట్లకు పరిమితం అయ్యాడు.  మీడియా ప్రశ్నిస్తుందని… బ్లూ మీడియాకే తాడేపల్లి ప్యాలెస్ లోకి అనుమతి ఇచ్చారు. ఆ మీడియా ముందు సొల్లు కబ్లుర్లు చెప్పాడు.  నేడు ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు నేరుగా పార్టీ కార్యాలయంలోకి వచ్చి తమ వినతులను స్వేచ్ఛగా అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు అధికారులు ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు.