– ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి విమర్శ
జమ్మలమడుగు, మహానాడు: నేను వేసిన బాల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తగిలి కాలు విరిగింది. ఆయన మాట్లాడిన మాటలకు నేను ఎక్కువగానే మాట్లాడగలను. సంస్కారం అడ్డు వస్తోందని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంకా ఏమన్నారంటే..
భయపెట్టి ఆయన రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి లోపల అంతా ఫ్యాక్షన్ బుద్ది. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం మొత్తం అనుకుంటోంది. అడ్డంగా నరేకేస్తా అని అంటే.. ఇంట్లో కూర్చుకోవడానికి నేను అమాయకపు ఓటర్ ని కాదు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు. వైస్సార్ కుటుంబం పుణ్యం మీద గెలిచిన వ్యక్తివి నువ్వు.
దొడ్డిదారిన టిడిపి పార్టీలోకి చేరావు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఎక్కడ పారపోయావో తెలియదు… రాష్ట్రం విడిచిపెట్టి పోయావు. చేతకానీ రాజకీయాలు చేసే వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. బ్యాటింగ్ చేసిన భూపేష్ రెడ్డి పక్కకి పోయి, ఆదినారాయణ రెడ్డి దొడ్డిదారిన వచ్చాడు. నీ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తావా? నన్ను కొట్టేదానికి నువ్వు కాదు కదా నీ తరం కూడా కాదు. జమ్మలమడుగు ఫ్యాక్షన్ వద్దు అని కోరుతున్న, నేను ఎప్పుడు ఫ్యాక్షన్ ను ఎంకరేజ్ చేయలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు, నీకు లెక్కే చేయను నేను. ప్రజల పక్షాన ధైర్యంగా ప్రశ్నిస్తా… ప్రజలకు అండగా ఉంటా… ఇస్తానుసారంగా మాట్లాడితే మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు.