నరసరావుపేట జమిందార్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు:  నరసరావుపేట జమిందార్ రాజా మాల్ రాజ్ కొండల్ రావు బహుదూర్‌ను ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దుశ్వాలువాతో సత్కరించారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారు. నరసరావుపేటను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలనే తపనతో పని చేస్తున్నట్లు వివరించారు.

చారిత్రాత్మక నరసరావుపేట నియోజకవర్గంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం అరాచకాలు రాజ్యమేలాయని, ప్రస్తుతం ప్రజాస్వామ్య పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నగసరపు సుబ్బరాయ గుప్త, కపిలవాయి విజయకుమార్, వనమ శివ, దినేష్, హరికృష్ణ, టీడీపీ,జనసేన శ్రేణులు పాల్గొన్నారు.