పెదకూరపాడు, మహానాడు: అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోని రైతుల వ్యవసాయ సంబంధిత విద్యుత్ కనెక్షన్లు సమస్యల గురించి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను సచివాలయంలో శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి రవి కుమార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
 
								