మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు

దశాబ్దాల తర్వాత నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరేసిన నేపథ్యంలో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారికి నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారికి ఎమ్మెల్యే అరవింద బాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవుని దయ,ప్రజల ఆశీర్వాదం ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైందన్నారు.ప్రజలకు మేలు చేసేది ఎవరో.. కీడు చేసేది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.ప్రజలకు మేలు చేసే, ప్రజల కోసం పని చేసే భాగ్యం కల్పించినందుకు ఈ రోజు మొక్కు తీర్చుకుంటున్నా అన్నారు. దైవ సాక్షిగా నాకు వచ్చిన అవకాశాన్ని ప్రజా సేవకు మాత్రమే ఉపయోగిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.