డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె

విజయవాడ: గత వైకాపా ప్రభుత్వంలో విజయవాడ నగరంలో ఎక్కడా కూడా సైడ్ డ్రైన్స్లో సిల్ట్ను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా డ్రైన్స్ పూడుకుపోయి రోడ్లు మీదకు పొంగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు.

శనివారం ఉదయం 7వ డివిజన్ మొగల్రాజపురం గుమ్మడివారి వీధిలో పాడైపోయిన డ్రైయిన్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ లోని పూడికలను తీయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ సమస్యలను తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని గద్దె రామమోహన్ అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ప్రజల వద్ద నుంచి చెత్తకు పన్ను వసూలు చేయడంలో చూపిన శ్రద్ద డ్రైనేజీల క్లీనింగ్ పై పెట్టిఉంటే నగరంలో డ్రైనేజీ సమస్య ఉండేది కాదన్నారు.

విజయవాడ నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ శ్రీనివాసరావు, అన్నే వీరభోగ వసంతరాయులు, దోమకొండ రవి, మాదాల మల్లిఖార్జునరావు తదితరులు ఉన్నారు.