ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయం స్ఫూర్తిదాయకం

-మొదటి జీతం సేవా కార్యక్రమాలకు వెచ్చించిన ఎమ్మెల్యే 
– గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు   

గుంటూరు, మహానాడు : గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ రాజకీయాల స్పూర్తితో తన నెలవారి జీతాన్ని ప్రజలకు అంకితం చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయం యువతకు స్ఫూర్తి దాయకమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కొనియాడారు.

ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలిగా గల్లా మాధవి తనదైన  శైలిలో ప్రజలకు అండగా ఉంటూ గుంటూరు అభివృద్ధి పధంలో తీసుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు.  అలాగే ప్రభుత్వం ఎమ్మెల్యేగా తనకిచ్చిన నెలవారీ జీతం 1 లక్షా 50 వేల రూపాయలను ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాలకు ఇస్తామని ప్రకటించటం నేటి తరానికి గల్లా మాధవి స్ఫూర్తి దాయకంగా నిలిచారన్నారు.

ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి నెల జీతం 1,75,000 నుంచి అందులో 20 వేల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి, 25000 రూపాయలు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు, నియోజకవర్గంలో పేదల కోసం రూ.పదివేలతో  దుప్పట్లు, సచివాలయాల పరిధిలో పదివేల రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసి వాటిని , 50 వేల రూపాయలు ఎన్డీఏ కూటమిలో ఉన్న పేద కార్యకర్తలకి ఒక్కొక్కరికి 5000 చొప్పున 10 మందికి ఆర్థిక సాయం, డివిజన్లో సాయం కోసం ఎదురుచూసే పేద ప్రజల కోసం ఒక్కొక్కరికి 10000 చొప్పున ఐదుగురికి 50 వేల రూపాయలు అందజేయనున్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జీరో కరప్షన్ పాలిటిక్స్ కు పెద్దపీట వేసి నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతీ యువకులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారన్నారు.