వాడపల్లి, మహానాడు: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసన సభ్యుడు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.