అచ్చెనాయుడుని కలిసిన ఎమ్మెల్యే ప్రవీణ్ 

పెదకూరపాడు, మహానాడు:  సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు అచ్చెనాయుడుని  పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కింజారపు అచ్చెనాయుడు మనమంతా కలసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.