జగ్గయ్యపేట: ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అధిక వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామంలో మున్నేరు డ్యాం వద్ద ఇదివరకు వేసిన ఇసుక కట్టలు తెగిపోయి మున్నేరు నీరు అంతా కాలవకు ఎక్కకుండా నీరు మొత్తం ఏటి ద్వారా సముద్రానికి వెళ్లి మున్నేరు డ్యామ్ కింద ఉన్న పంట పొలాలకు సరిగా నీరు అందకపోవడంతో రైతులు భయాందోలనకు గురవుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతులతో, నాయకులతో కలిసి పరిశీలించి గండిని పూడ్చాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గండి పూడ్చే పనులను రైతులు,అధికారులు, నాయకులతో కలిసి తాతయ్య దగ్గరుండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.