మెప్మా బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల టౌన్ లోని పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మెప్మా బజార్ ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో గురజాల నగర పంచాయతీ – మెప్మా మహిళా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా (స్వయం సహాయక) గ్రూప్ సభ్యులు, గురజాల మండలం టౌన్ లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన రాష్ట్ర, పార్లమెంటు, మండలం, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.