Mahanaadu-Logo-PNG-Large

ఇచ్చిన మాటకు కట్టుబడిన మోదీ

– మెగా డీఎస్సీ పై సంతకం పెట్టడం సంతోషం
– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ

విజయవాడ: ఈ రాష్ట్రంలో జగన్ పాదయాత్ర లో యువతని నమ్మించి గత ఐదు సంవత్సరాలు మోసం చేసారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ప్రకటిస్తే వైసీపీ నేతలు స్పందన చూస్తే వారి అహం మాటల్లో కనపడుతోంది. అందుకే యువత వారి ఓటుతో వైసీపీ కి తగిన గుణపాఠం చెప్పారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి మోదీ కల ని నెరవేరుస్తున్న విధంగా ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీ పై సంతకం పెట్టడం చాలా సంతోషంగా ఉంది.రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పనలో భాగంగా లక్షలాది మంది కి ఉపాధి కలిపించటంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది.

గత ప్రభుత్వంలో 6వేలు డీఎస్సీ ఉద్యోగాలు తీసి మెగా డీఎస్సీ పేరు పెట్టుకున్నారు, అది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ. జగన్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి యువతని మోసం చేశారు. యువతని మోసం చేయటంతో, వారి ఓటు తో జగన్ కి సరైన సమాధానం ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండ డీఎస్సీ పోస్ట్ లు ఇచ్చిన ముఖ్యమంత్రికి మా ధన్యవాదాలు తెలియ చేస్తున్న భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ తోపాటు ప్రధాన కార్యదర్శి నవనీత్ కృష్ణారెడ్డి, ఆఫీస్ ఇంచార్జ్ చైతన్య శర్మ , కోశాధికారి కృష్ణ చైతన్య , పల్నాడు జిల్లా ఇంచార్జ్ శివకృష్ణారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ రవికాంత్ ఐటీ సెల్ కన్వీనర్ జీవీ రెడ్డి , కాలేజ్ అవుట్ రీచ్ సెల్ కన్వీనర్ రవి , కార్యవర్గ సభ్యురాలు శిరీష , జిల్లా అధ్యక్షులు నరసరాజు తదితరు యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.