Mahanaadu-Logo-PNG-Large

పీఎం కిసాన్‌పై మోదీ తొలి సంతకం

-17వ విడత నిధుల విడుదల
-9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ మాది కిసాన్‌ కళ్యాణ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం. అందుకే తొలి సంతకం రైతు సంక్షేమానికి సంబంధించిన కావడం సముచితమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్‌ 17వ విడత విడుదలకు అనుమతిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. దీని వల్ల 9.3 కోట్ల మంది రైతులకు దాదాపు 20,000 కోట్లు వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.