– టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ
విజయవాడ, మహానాడు: ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా విమర్శించారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు పదవి పోయి.. అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు.. అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది. అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు.
జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్. ఇప్పుడు వైసీపీ నేతలు ఏదో జరిగిపోయినట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో అమరావతి లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. జగన్ వచ్చాక 404 కోట్లతో విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇందులో కూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్. అంబేద్కర్ మద్యం మాన్పించాలని చెబితే .. జగన్ మద్యం ఏరులై పారించాడు. మద్య నిషేధం అని ఓట్లు వేయించుకుని.. మద్యం తో కోట్లు దోచారు. సంపద సృష్టించమని అంబేద్కర్ చెబితే… ఉన్న సంపదను కొల్లగొట్టారు జగన్. అమర్ రాజా వంటి ఎన్నో పరిశ్రమలు ను బయటకి పంపారు. మీడియాకు , ప్రజలకు స్వతంత్రంగా చెప్పుకునే స్వేచ్చ ఇచ్చావా? నీ దెబ్బకి పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావాలంటే భయపడిపోయారు.
అమరావతి లో అంబేద్కర్ విగ్రహం కట్టి తీరతాం.. ఇప్పుడు ట్విట్టర్ లో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా జగన్ తెలియదు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతాం. జగన్ మళ్లీ వచ్చి ఉంటే రోబోలను పెట్టుకుని ప్రజలను తరిమి కొట్టేవారు. కులాల చిచ్చు పెట్టి వచ్చే పరిశ్రమ లను ఏపి రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు విజన్, పాలనా దక్షత ముందు నువ్వు, నీ తాత ఆటలు సాగవు. జగన్ ఇప్పుడు అయినా రాష్ట్ర అభివృద్ధి కి సహకరించు.. అడ్డుకునేలా కుట్ర చేస్తే ఈసారి ప్రజలే నిన్ను తరిమి కొడతారు.