భూ సమస్యలు, భూ కబ్జాలపైనే అధిక అర్జీలు

– రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న అర్జీదారులు
• వైసీపీ హయాంలో ఆగిన బిల్లులకోసం పలువురు విన్నపం
• పిల్లల చదువు, ఫీజు రియంబర్స్ మెంట్, విదేశీ విద్య, సీఎం ఆర్ఎఫ్ సహాయానికి పలువురు అభ్యర్థన
• నామినేటెడ్ పదవులకు అర్జీలు ఇచ్చిన టీడీపీ నేతలు
• ఇంకా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు

విజయవాడ: గడిచిన రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు… పేద, బడుగు, బలహీన వర్గాల భూములను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారు.. జగనన్న ఇళ్ల పేరుతో దగా చేశారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా మోసం చేశారు. అధికారులను తొత్తులుగా చేసుకుని ఇష్టానుసారంగా వైసీపీ నేతలు ప్రవర్తించారు. పేదల ఇళ్లను కూల్చారు.

బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. కూటమి అధికారంలోకి రావడంతో నేడు వారి బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అర్జీలు తీసుకుని పోటెత్తుతున్నారు అని.. మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వారు ఇరువురు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.

వైసీపీ పాలనలో అరాచకాలకు అకృత్యాలకు రాష్ట్రంలో పేదలకే ఎక్కువ అన్యాయం జరిగిందని.. నియంత జగన్ పాలనలో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో తెలియక.. అధికారుల వద్దకు వెళ్లినా పట్టించుకోక.. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. మంత్రి వాసంశెట్టి, మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు.

నేడు పేదల ప్రభుత్వంగా కూటమి ప్రజా సమస్యల పరిష్కారని పెద్దపీట వేసిందని.. ప్రజా నాయకుడు, పేదల పెన్నిధి, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి తపించే మానవతావాది. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశానుసారం.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.

ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి వెంటనే పరాష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వెనువెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను విన్నవించి పరిష్కరించవలసిందిగా సూచించినట్లు తెలిపారు. అధికారులు కూడా మానవతాదృక్పదంతో ప్రజా సమస్యల పరిష్కారాని కృషి చేసి.. అర్జీలు పునరావతృతం కాకుండా పరిష్కరించాలని కోరారు.

కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలానికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే బాధితుడు తమకు వారసత్వంగా వచ్చిన భూమి 5 ఎకరాల 26 సెంట్లకు వైసీపీ నేతలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి లింగారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మొరపెట్టుకున్నాడు.

కోర్టు తనకే అనుకూలంగా తీర్పు ఇచ్చినా… తన భూమిలో తనను సాగు చేసుకోనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దయ ఉంచి న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో విన్నవించుకున్నాడు. వెంటనే మాజీ మంత్రి జవహర్ ఆనియోజకవర్గ సమన్వయ కర్త రితీష్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించవలసిందిగా తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అధికారులను లోబరుచుకొని రికార్డులను తారుమారు చేసి తమ భూముల వివరాలను మార్చేసి… పొలం తమదై అయినా వేసిన పంటలను వారు దౌర్జన్యంగా కోసుకుపోతున్నారని.. బీలా పార్వతి వాపోరు. ఏలూరు అదనపు జిల్లా న్యాయస్థానం తనకు సానుకూలంగా తీర్పు ఇచ్చినా అప్పన్న కుమారుల దౌర్జన్యాలు ఆగడంలేదని వాపోయారు. దీంతో మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ అక్కడి డీఎస్పీకి ఫోన్ చేసి భూ సమస్యను వివరించి… సమస్య పరిష్కరానికి కృషి చేయాలని విన్నవించారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామంలో సుమారు వంద సంవత్సరాల నుండి జీవిస్తున్న ఎస్పీ మాల కుటుంబాలకు చెందిన 30 నీరుపేద కుటుంబాల ఇళ్లను టీడీపీకి అనుకూలంగా ఉన్నారని జేసీబీలు తీసుకు వచ్చి కూలగొట్టించారని నెల్లిమర్ల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు టొంపల నర్సయ్య వాపోయారు. పేదల ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం తమ యందు దయ ఉంచి ఎస్సీలకు పక్కా ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన ఎన్. వెంకటేశ్వర్లు తమకు ఉండటానికి నివాసం లేదని.. తమ యందు దయ ఉంచి ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికపాడు గ్రామానికి చెందిన కె. వినోద్ బాబు, డి రవీంద్రబాబు, ఎం. చైతన్యలు వారి గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సమస్యలు, సీసీరోడ్డు సమస్యలు, మంచినీటి ట్యాంక్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి సమస్యలను మంత్రి, మాజీ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఆ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం కోవిలంపాడు గ్రామానికి చెందిన దేవండ్ల తిరుపయ్య తమకు పరిహారం చెల్లించకుండా తమ భూమిలో ఎన్ ఎచ్ 167బీ రోడ్ నిర్మాణం చేపడుతున్నారని.. కోల్పోతున్న భూమి వాస్తవ విస్తీర్ణం చూపించకుండా తక్కువ చూపిస్తున్నారని ఎన్నిసార్లు రెవెన్యూ , ఎన్. హెచ్ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదని గ్రీవెన్స్ లో వినతిని అందించారు. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం, కుందుర్పి ఎస్పీ కాలనీలో కనీస మౌలిక వసుతులు లేవని… రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వం ఏనాడు తమ కాలనీని పట్టించుకోలేదని.. ఆ కాలనీ వాసులు నేడు మంగళగిరి గ్రీవెన్స్ మొరపెట్టుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

కర్నూలు జిల్లా మద్దికెర మండలం, మద్దికెరకు చెందిన మాచినేని వెంకటేశ్వరులు తాను నిరుపేదనని.. తనకు వచ్చిన వ్యాధి కారణంగా కర్నూలులోని అమిలియో హాస్పిటల్ నందు ట్రీట్ మెంట్ చేసుకున్నట్లు.. దానికి సుమారు లక్షకు పైనా ఖర్చు అయినట్లు… పేదరికం కారణంగా తాను అంత డబ్బులు చెల్లించలేనని తనకు సీఎం ఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

తోటకూర కిరణ్ కుమార్ తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని.. తనకు ఇద్దరు ఆడబిడ్డలని.. వృత్తి రిత్యా తాపీ పని చేసుకుంటున్న తాను ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో సంపాదన లేదని… తన బిడ్డలను చదివించుకోలేకపోతున్నానని… ప్రభుత్వం తనకు సాయం చేయాలని విన్నవించుకున్నాడు.

షేక్ మహ్మద్ జాయెద్ నీట్ లో 244 మార్కులు సాధించి విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న తాను గత ప్రభుత్వ విధానాలవలన తన చదువకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తన సమస్యను పరిష్కరించి నిరుపేద మైనార్టీ అయిన తనను ఉన్నత విద్య కొనసాగుటకు విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా స్కాలర్ షిప్ మంజూరు చేయాలని కోరారు.

నూక చెన్న వర్థన్ అనే విద్యార్థి తనకు ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు రావడంతో గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటో బీటెక్ జాయిన్ అయ్యేందుకు సీటు వచ్చిందని… తనకు వచ్చిన మార్కుల వలన కాలేజీ కొంత ఫీజు తగ్గించిన కూడా మీగిలిన రూ. 3లక్షల ఫీజును తాను కట్టుకోలేనని విద్యాశాఖ మంత్రి తన చదవుకు ఆదుకోవాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థ వెహికిల్ డిపోలో గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్నమెకానిక్స్, మరియు హెల్పర్లను క్లీన్ ఎన్విరాల్మెంట్ లో చేర్చి జీతాలు పెంచి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి మంత్రి, మాజీ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రాయల సీమకు చెందిన పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో ఇంకా పలువురు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ.. టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని.. ముఖ్యంగా పోలీస్ శాఖలో వారు ఉన్నారని వారిని మార్చాలని విజ్ఞప్తి చేశారు.