టిట్కో గృహాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

చిలకలూరిపేట, మహానాడు:  చిలకలూరిపేటలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాలను పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు  శుక్రవారం పరిశీలించారు. టీట్కో గృహాల్లో నివసిస్తున్న వారి సమస్యలు విని, వారికి కావలసిన సదుపాయాలను రాబోయే రెండు నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు.

ఈ సందర్బంగా పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ…

గత తెలుగుదేశం పార్టీ హయాంలో మా అది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టీట్కో గృహాలు 4600 నిర్మించారు, కానీ వైఎస్సార్సీపీ పార్టీ హయాంలో  గృహాలు అభివృద్ధి చేయకుండా ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ  700 మంది నివాసం ఉంటున్నారు. వారికి కావలసిన మంచినీటి సౌకర్యాలు, విద్యా, వైద్యం, పోలీస్ సిబ్బంది అన్నీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న 2000 గృహాలు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు.