అమరావతి : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఎన్టీఆర్ జిల్లాలో తను నిర్వహించిన సమీక్షా సమావేశాల నివేదికను అందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానురు వరకు రాబోయే ఫ్లైఓవర్ కి సంబంధించి సమగ్ర రిపోర్ట్ సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు.
అలాగే తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు కిడ్నీ బాధితుల సమస్య గురించి ,అక్కడ వున్న నీటి సమస్య వివరించారు. కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ఇక విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ భవనం నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి..ఏ దశలో వున్నాయో తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల్లోనే రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి బాటలు వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపి కేశినేని శివనాథ్, ఆయన తనయుడు కేశినేని వెంకట్ శుభాకాంక్షలు తెలిపారు. కేశినేని వెంకట్ పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు అందుకున్నారు.
 
								