ఎంపీ పెమ్మసానికి దృష్టికి పలు సమస్యలు

గుంటూరు, మహానాడు: మంగళగిరి లోని ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు ను సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేసేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టి కి తీసుకెళ్ళడంతో మంత్రి సూచనల మేరకు కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ ని కలిసి వివరించినట్టు పలువురు జనసేన నాయకులు శుక్రవారం మీడియాకు తెలిపారు.

దీనితో పాటు 2018 లో శంకుస్థాపన జరిగిన నిర్మాణానికి నోచుకోని రేవేంద్ర పాడు వంతెన సమస్య ను వివరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంటిఎంసి ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, పార్టీ దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస రావు, చిన్న కాకాని గ్రామ అధ్యక్షుడు లింగినేని శ్రీనివాస రావు, జనసేన నాయకులు తిరుమలశెట్టి సురేంద్ర, కాపరౌతు సుందరయ్య పాల్గొన్నారు.