నెల్లూరు, మహానాడు: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా బొకేలు సమర్పించి వేమిరెడ్డి పేరును విస్మరించడంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు.
దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి కిందకు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. స్టేజ్‌పై తనకు తగిన గౌరవం దక్కలేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వెంట కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును మంత్రి ఆనం తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్, అధికారులను మంత్రి హెచ్చరించారు