అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో గురువారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఫలితాలు వెలువ డిన అనంతరం రెండో రోజూ కూడా నేతలు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది.