గుంటూరు: నగరంలోని ఉద్యోగనగర్‌లో బుధవారం రాత్రి రౌడీషీటర్ బాజీని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఆయన గత కొంతకాలంలో క్రోసురులో నివాసం ఉంటున్నాడు. రెండు హత్య కేసులలో నిందితుడిగా కూడా ఉన్నాడు. మద్యం మత్తులో చెలరేగిన వివాదమే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు నలుగురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.