తాగునీటి సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు: పట్టణ వాసులకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే నా ప్రథమ లక్ష్యం, మినరల్ వాటర్ ను అతి తక్కువ ధరకు త్వరలో పేట ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2. 3 నెలలుగా పట్టణ వాసులకు ఏర్పడిన తాగునీటి సమస్యకు చరమగీతం పాడనున్నానని, పట్టణ వాసులకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేసారు. పాత మంచి నీటి చెరువు, కొత్త మంచి నీటి చెరువుల వద్ద మోటార్ల ద్వారా నీటిని నింపుతున్న పనులను శనివారం పర్యవేక్షించారు.

ఈ సంధర్భంగా ఆయన మట్లాడుతూ..  పేట తాగు నీటి సమస్యను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళామన్నారు. 5 టీఎంసీల నీరు పట్టణ వాసుల తాగునీటి అవసరాలకు సరిపోవని, మరో 3 టీఎంసీల నీరు అదనంగా కావాలని అడిగి, ఒప్పించానని తెలిపారు. గత బుధవారం నుంచి మొదలైన నీటి విడుదల వచ్చే నెల 6 వ తారీఖు వరకు ఉంటుందని తెలియజేశారు. ఇక నుండి పట్టణంలోని మెరక ప్రాంతాలలో కూడా నీటి సమస్య లేకుండా నీటి పరిమాణాన్ని పెంచి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్టీఆర్ సుజల ద్వారా 2/- రూపాయలకే మినరల్ వాటర్ ను ఆగష్టు 15 నుంచి 25 అవుట్ లెట్ల ద్వారా ప్రజలకు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.కిన్లే నీటితో సమానంగా నాణ్యత కలిగిన మినరల్ వాటర్ ను కేవలం 2 రూపాయలకే ప్రజలకు అందించి తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమము చేపట్టనున్నట్లు పుల్లారావు తెలియజేసారు. టిడ్కో నివాస గృహాలు విషయంలో కూడా ప్రత్యేక పర్యవేక్షణ తీసుకుంటున్నామని, అందులో భాగంగానే పట్టణ సీఐని పల్లె నిద్ర చేయమని ఆదేశించామని తెలిపారు. త్వరలో నేను కూడా స్వయంగా టిడ్కో గృహాల వద్ద పల్లెనిద్ర చేస్తానని తెలియజేసారు.

టిడ్కో గృహాల వద్ద ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఇక ఉపేక్షించమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతానని తెలిపారు. జిల్లాలో ఎవరికీ సాధ్యం కాని విదంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ 52 ఎకరాల సముదాయంలో కట్టిన 4500 ఇళ్లను అర్హులకే అందించి, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివాసం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పత్తిపాటి పుల్లారావు తెలిపారు.