నా వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించారు

-నచ్చిన పార్టీకి ప్రచారం ప్రాథమిక హక్కు
-లంచాలతో ప్రభావితం చేశామనడం అబద్ధం
-ఉద్దేశపూర్వకంగా బురదజల్లాలని చూస్తున్నారు
-ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలిపివేయండి
-టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ కోమటి జయరామ్‌
-ఎన్నికల కమిషన్‌ నోటీసుపై వివరణ

మంగళగిరి, మహానాడు: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండురోజుల క్రితం నిర్వహించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సానుభూతిపరుల మీటింగ్‌ రహస్యంగా నిర్వహించింది కాదని, సమావేశాన్ని యూట్యూబ్‌లో ప్రేక్షకుల కోసం ప్రసారం చేసినట్లు ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ కోమటి జయరా మ్‌ తెలిపారు. వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్‌ తనకు ఇచ్చిన నోటీసుపై గురువారం ఆయన వివరణ ఇచ్చారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ భావజాలం, పార్టీ కార్యక్రమాల ప్రచారం చేయాలని సమావేశంలో వక్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనలు చేసే ఎన్‌ఆర్‌ఐలు ఇతరుల నుంచి వనరులు సమీకరించకుండా సొంత వనరులు ఖర్చు చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. నాలుగు దశాబ్ధాల పాటు టీడీపీ పాలనలో అనేక కుటుంబా లకు జరిగిన మేలును ప్రచారం చేయడమే సమావేశం ప్రధాన లక్ష్యం.

టీడీపీకి ఓటేస్తే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని చెప్పాలని అనుకున్నాం. కానీ సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని వక్రీకరిస్తూ నాపై ఫిర్యాదు చేశారు. నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకోవడం ప్రాథóమిక హక్కు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యుడిగా నా సహచర ఎన్‌ఆర్‌ఐలను టీడీపీకి పనిచేసేలా అభ్యర్థించానని తెలిపారు. ఇందులో లంచాలు ఇచ్చి ప్రభావితం చేశానని చెప్ప డం అవాస్తవమన్నారు. ప్రభుత్వ సలహాదారులపై మేం తప్పుడు వ్యాఖ్యలు చేశామంటూ వైకాపా నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారని వివరణలో పేర్కొన్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సభ్యులుగా మేం మన దేశ చట్టాలను గౌరవించి పాటిస్తామని తెలిపారు. ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సభ్యుఢగాి ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తున్నాను. గత ఆరు సాధారణ ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్నాను. కానీ, ఎన్నికల నియమ నిబంధనలు ఎన్నడూ ఉల్లంఘించలేదు. నా వ్యాఖ్యలను వైకాపా నేతలు వక్రీకరించి ఫిర్యాదు చేశారు. వాస్తవాలను పరిశీలించి ఉద్దేశ పూర్వకంగా నాపై బురద చల్లాలని చేసిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని కోరారు.