సహాయక చర్యలు లో బిజెపి శ్రేణులు
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుత పరిస్థితులను బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్వయంగా నాతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను ఆరా తీసారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. సహాయక చర్యలు లో పాల్గొనాలని నడ్డాజీ సూచించారు అన్నారు. బిజెపి శ్రేణులు సేవా కార్యక్రమాలు ఉదృతం చేసి,వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బిజెపి శ్రేణులు సహకారం అందించాలని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.