హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది.