మంగళగిరిలో నందమూరి సుహాసిని ప్రచారం

నారా లోకేష్‌ను గెలిపించాలని పిలుపు

మంగళగిరి రూరల్‌:  నారా లోకేష్‌కు మద్దతుగా శుక్రవారం మంగళగిరి రూరల్‌ చిన్నవడ్లపూడి గ్రామంలో నందమూరి సుహాసినితో పాటు లోకేష్‌ కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ముందుగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సేవ్‌ డెమెక్రసీ-సేవ్‌ అమరావతి కోసం అందరూ ముందుకురావాలని కోరారు. కూటమి అభ్యర్థులు నారా లోకేష్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ను భారీ మెజార్టీతో గెలిపిం చి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.