నందిగామ మున్సిపాలిటీ టీడీపీ కైవసం!

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

నందిగామ, మహానాడు : నందిగామ మున్సిపాలిటీ పీఠాన్ని త్వరలో కైవసం చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో కౌన్సిలర్ వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో కౌన్సిలర్ తానూరి రాము పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీకి కౌన్సిలర్ల బలం 12 కు పెరిగింది. అంతేగాకుండా చైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ అకాల మరణంతో 11, 7 వార్డుల ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కౌన్సిల్లో వైసీపీ సంఖ్యా బలం 5కు పడిపోయింది.