– వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే చదలవాడ
వెలగపూడి, మహానాడు: వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద బాబు నిమ్మలతో మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజుల ఎన్డీఏ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రజలు సంతోషంగా చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సైకో జగన్ రెడ్డి పాలన పోయి రామరాజ్యం లాంటి చంద్రన్న పాలన వచ్చిందని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రజలు సాదరంగా ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు.