ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

– మంత్రి వాసంశెట్టి సుభాష్‌

రామచంద్రపురం, మహానాడు: వెల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ప్రతి మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అన్ని శాఖలు సమక్షంలో పరిష్కారిస్తారని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

రైతులందరూ తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కనీసం 10 ఎకరాలు ఉన్న రైతు ఒక ఎకరానికైనా సాగు చేయాలని తెలిపారు. త్వరలో ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలులో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సరిపడ గోనె సంచులు తదితర సామగ్రి, అలాగే రైతులు ఎంపిక చేసుకునే విధంగా రైస్ మిల్ విధానం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు, గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, ఎంపీటీసీ చిక్కాల స్వామి కాపు, వ్యవసాయ శాఖ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.