Mahanaadu-Logo-PNG-Large

కూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ

పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు
రాక్షస పాలన అంతమే లక్ష్యమని వెల్లడి
స్వాగతించిన టీడీపీ నేత వర్లరామయ్య

మంగళగిరి: రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి నవతరం పార్టీ మద్దతు ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత ఆదేశాలతో ఆ పార్టీకి స్వాగతం పలుకుతున్నట్లు వర్ల రామయ్య తెలిపారు. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని, ఎన్టీఏ అభ్యర్థుల గెలుపుకు స్వచ్ఛందంగా కృషి చేసేందుకు నవతరం పార్టీ మద్దతు తెలపడం అభినందనీయమ న్నారు. ఆ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలు గాజు గ్లాసు గుర్తుతో శివారెడ్డి(గుంటూరు), యనమండ్ర కృష్ణకిషోం ్‌శర్మ (విజయవాడ), గండికోట రాజేష్‌శర్మ(విశాఖ), నలమల తిరుపతిరావు(బాపట్ల), అలాగే ఆరు అసెంబ్లీ స్థానాల్లో బోయన నరేష్‌(రాప్తాడు, గాజు గ్లాసు గుర్తు), షేక్‌ అయాజ్‌(ధర్మవరం, గాజు గ్లాజు గుర్తు), నందికోళ్ల రాజు(మండపేట, బకెట్‌ గుర్తు), శారా జ్యోతి(గాజువాక, బకెట్‌ గుర్తు) పోటీ నుంచి తప్పుకుని కూటమికి మద్దతు తెలపడం గొప్ప విషయమన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే మద్దతు

నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎటువంటి ఆంక్షలు లేకుండా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా మా మద్దతు కూటమి తెలుపుతున్నాం. రాక్షస పాలన అంతానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మా పార్టీ నేతలు పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. 175 నియోజక వర్గాలు, 25 పార్లమెంట్‌లలో నవతరం పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు కూటమికి మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వంటి ప్రజా సేవకులు అవసరమని, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కౌరవ సభ ఉండకూడదు గౌరవ సభ ఉండాలి. వారధి నిర్మాణంలో రాముడికి ఉడత సాయం చేసినట్లు ఎన్టీఏ కూటమికి తాము మద్దతు తెలిపినట్లు చెప్పారు.