విజయవాడ, మహానాడు: వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన మరో నాలుగు హెలీకాప్టర్లు. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత.
నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూచనలు ఇస్తున్నారు.