21 మందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు!

– సహాయక చర్యల్లో పాల్గొనండి
– పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్‌ పిలుపు

విజయవాడ, మహానాడు: కొటికలపూడిలో కృష్ణానది వరదలో చిక్కుకున్న 21మందిని ఎఎల్ హెచ్ 717 హెలీకాప్టర్ ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించాయి. విజయవాడ డివిజన్ లో 42 పునరావాస కేంద్రాల్లో వరద బాధిత ప్రజలకు ఆశ్రయం, ఆహారం, మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. కాగా, సహాయక చర్యలను మంత్రి లోకేష్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు సూచనలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… వరద సహాయ చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు. మంత్రి పిలుపునకు స్పందించి మంగళవారం ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలతోపాటు సమీప జిల్లాల నుంచి పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రకాశం బ్యారేజి భద్రతపై ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి. క్రమేణా తగ్గుతూ వస్తున్న కృష్ణమ్మ వరద, ప్రకాశం బ్యారేజి వద్ద మరో ఎనిమిది వేల క్యూసెక్కులు తగ్గి 11.25 లక్షల క్యూసెక్కులకు చేరుకున్న వరద ప్రవాహం.