నెల్లూరు ఎంపీ రూ. కోటి విరాళం

నెల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.