పిన్నెల్లిపై ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు

అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయిలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రతినిధి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ అలాంటి సాహసం చేయకుండా చర్యలు ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ వీడియోను అందజేశారు.