ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూటమిదే గెలుపు

ఓటమి భయంతో జగన్‌ నాటకాలు
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌

పెనమలూరు, మహానాడు : పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌తో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ ఓటమి భయంతో అబద్ధపు ప్రచారాలకు దిగాడని, అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని, జగన్‌, వైసీపీని ఆంధ్ర రాష్ట్ర పొలిమేరల వరకు తరిమితరిమి కొడతారని స్పష్టం చేశారు. పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌కు సైకిల్‌ గుర్తుపై, మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.